నగరంలో కలకలం రేపుతున్న సిసిఎస్ కానిస్టేబుల్ హత్య. 

హంతకుడు రియాజ్ నీ పట్టించిన వారికి రివార్డ్ 50వేల రూపాయలు.

నిజామాబాద్ జై భారత్ అక్టోబర్ 18: సిసిఎస్ కానిస్టేబుల్ హత్య ఘటన పై నిజామాబాద్ సిపి సాయి చైతన్య స్పందించారు. పలు కేసులలో నిందితుడైన షేక్ రియాజ్ ను పట్టుకొని వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని సిపి తెలిపారు త్వరలోనే నిందితుడిని పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చనిపోయిన కానిస్టేబుల్ ప్రమోద్ పై ప్రగడ సానుభూతి తెలిపారు. ఎమోషనల్ గా వారి కుటుంబానికి సహాయం అందించాలని మీడియా సమావేశంలో తెలియజేశారు. లేనిపోని అపోహలు సృష్టించకూడదని అన్నారు. ప్రజల కోసం రాత్రి పగాలు ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా నిధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారిపై ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని తెలిపారు. ఇది ఇలా ఉండగా ఘటన జరిగిన వెంటనే ప్రజలు ఆస్పత్రికి తరలియకుండా చోద్యం చూస్తూ ఫోటోలు వీడియోలు చిత్రీకరిస్తూన్నారు చాలా బాధాకరమైన విశేషం అని తెలిపారు. ప్రజల్లో మార్పు రావాలని ప్రతి ఒక్కరూ బాధ్యతగా బాధితులకు ఆసుపత్రికి తరలించాలని తెలిపారు ఈరోజు నీధులు నిర్వహిస్తున్న ప్రమోద్ కావచ్చు సామాన్యమైన ప్రజలు కావచ్చు అని తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment