నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 23 :ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మితిమీరిపోతున్న వడ్డీ వ్యాపారుల ఆగడాలపై కొరడా జులిపించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వడ్డీ వ్యాపారస్తుల గురించి ఆరా తీస్తూ తనిఖీలు చేపడుతున్నారు. రూలర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఆరిఫ్, పోలీసు బృందం వడ్డీ వ్యాపారుల ఇండ్లలో, కార్యాలయాలలో తనిఖీలు నిర్వహించారు.నిజామాబాద్ సీపీ సాయి చైతన్య చేపడుతున్న ప్రజావాణి కార్యక్రమంలో అప్పులిచ్చిన వడ్డి వ్యాపారులు ఆస్తులు తనఖా పెట్టి( సెల్ రిజిస్ట్రేషన్) లు చేసుకోని, అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారనీ ఫిర్యాదు చేయగా. లైసెన్స్ లేకుండా ఫైనాన్స్ వ్యాపారం నిర్వహణపై ఫిర్యాదుల నేపథ్యంలో పి సాయి చైతన్య సోదాలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా లో ఏకకాలంలో పది బృందాలతో సోదాలు చేపడుతున్నారాని తెలియజేశారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్ ల లో పోలీస్ అధికారులు ఆకస్మిక తనిఖీలు.. సంబందిత ఎసిపీల పర్యవేక్షణలో సీఐలు, ఎస్ఐల అధ్వర్యంలో జరుపుతున్నారు.
నగరంలో వడ్డీ వ్యాపారులపై కొరడా ఝులిపించిన పోలీస్ కమిషనర్
Published On: August 23, 2025 3:24 pm









