నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 19 : మంగళవారం తెల్లవారుజామున టౌన్ 3 పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో SBI బ్యాంక్ ATM లో గుర్తు తెలియని నేరస్తులు గ్యాస్ కట్టర్ తో ఏటీఎంలో ప్రవేశించి దొంగతనం కొరకు ప్రయత్నం చేయగా అలర్ట్ మెసేజ్ అందుకున్న టౌన్ 3 పోలీసులు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకోగా వారు ఈకో వ్యాన్లో పారిపోయి పాల్ద గ్రామ శివారులో వ్యాన్ వదిలేసి పారిపోయారు.ఈ సంఘటన స్థలాన్ని ఏటీఎం సెంటర్ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపిఎస్. సందర్శించి , నేరం జరిగిన విధానాన్ని పరిశీలించి ఎస్సై హరిబాబు, సిఐ శ్రీనివాస్ రాజు లకు సూచనలు ఇచ్చి వీలైనంతవరకు త్వరగా నేరస్తులను పట్టుకోవాలి అని ఆదేశించారు. క్లూస్ టీం , సిసిఎస్ టీం అధికారులకు కేసు పరిశోధనకు సంబంధించి తగు ఆదేశాలు జారీ చేసినారు.









