గణేష్ విగ్రహా ప్రతిమల ఏర్పాటుకు ఆన్ లైన్ ద్వారా సమాచారం అందించాలి –పోలీస్ కమిషనర్ వెల్లడి

ప్రతి ఒక్కరూ పర్యావరణ అనుకూలమైన వినాయక చవితి జరుపుకోవాలి

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 18 : గణేష్ మండపాల వద్ద నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి అని విజ్ఞప్తి సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకునే కలిసికట్టుతమని నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు ప్రజల సొంతమని, రానున్న వినాయక చవితి ఉత్సవాలను నిర్విఘ్నంగా జరుపుకోవడంలో ఉత్సవ కమిటీలు, యువజన సంఘాలు మీ పోలీసులకు సహాకరించాలని గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య,అన్నారు.ఈ నెల 27న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని అన్ని గణేష్ మండపములకు సెక్యూరిటీ ఇవ్వడానికి మరియు పాయింట్ బుక్ ఏర్పాటుకోసం సమాచారం ఇవ్వగలరు. కావున నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలోని అన్ని గ్రామాలలోని ఆయా వీధులలో గణపతిని ప్రతిష్టించుకునే సంఘాల వారు అండ్ కాలనీల వారు ఈ దిగువ తెలియజేసిన లింక్ ద్వారా సమాచారం అందించాలి https://policeportal.tspolice.gov.in/index.htm.భక్తులకు మరియు విగ్రహ తయారుదారులకు విజ్ఞప్తి ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను వాడకం చేయాలని విగ్రహ తయారీ దారులందరు సేంద్రీయ పెయింట్లు వాడాలని మండపాల నిర్వాహకులు అగ్ని ప్రమాదం సంభవిస్తే ముందస్తు భద్రతా ఏర్పాట్లు మరియు వర్షం వచ్చినప్పుడు తీసుకోవల్సిన భద్రతా చర్యలు మండపాల నిర్వాహకులు కొంతమంది స్వచ్ఛంద సేవకులు 24 గంటల పాటు పండళ్ల వద్ద అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment