వరద ప్రాంతాలను పరిశీలించిన సబ్ కలెక్టర్.

బాన్సువాడ జై భారత్ ఆగస్టు 16 : జుక్కల్ మద్నూర్ ప్రధానరహదారి మధ్యన ఉన్న అంతపూర్, తడ్గుర్ వాగులుపొంగి పొర్లుతున్నాయి.అదేవిధంగా దిగువ భాగాన ఉన్న సోమూర్, చిన్న ఎక్లారా గ్రామాల మధ్యలోఉన్నలో లెవెల్ వంతెనల పై నుండి వరద పారడంతో రోడ్లు పాడయిపోయాయి.ఈప్రాంతాలను శనివారం సందర్శించిన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ పాడైపోయిన రోడ్లకువెంటనేతాత్కాలిక మరమ్మత్తులుచేయాలనిసంబంధితశాఖఅధికారులను ఆదేశించామద్నూర్ జుక్కల్ రహదారిలో అంతపూర్ తడ్గుర్ వద్ద వాగు వరద దాటికి పాడైపోయిన రోడ్డును వరద తగ్గి, రోడ్డు రిపేర్ అయ్యేంత వరకు రోడ్డును మూసివేసి, రాకపోకలునిలిపి వేయాలన్నారు.ఇంక ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు (భారీ వర్షాలు ఉన్నందున) ప్రజలు ఇంటి నుండి బయటకు రావొద్దుఅన్నారు. జుక్కల్, మద్నూర్ మండలాల మధ్య గ్రామాల మధ్యలో వర్షాలకు వాగులు పొంగి పొర్లు తున్నాయి కాబట్టి ప్రజలు వర్షాలు తగ్గే వరకు ముఖ్యంగా రాత్రి సమయాలలో ప్రజలు ఎవరు ప్రయాణాలు చేయరాదు అన్నారు. సబ్ కలెక్టర్ వెంట మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్, ఎంపీడీఓ రాణి, మండల ఎస్ హెచ్ ఓవిజయ్, ఆర్ అండ్ బి ఏ ఈ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment