నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : మహారాష్ట్ర లోని బోకర్ తాలూకా నుంచి నిజామాబాద్ కుగంజాయి రవాణా చేస్తు క్రయ విక్రయాలు చేస్తున్న యువకుడిని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సిఐ వెంకటేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఖిల్లారోడ్ లోని అమన్ నగర్ లోతనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో షేక్ మేరాజ్ అనేయువకుడు బైక్ పై వెలుతుండగా తనిఖీ చేయడంతో అతని వద్ద 6.5 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.మహారాష్ట్రలోని భోకర్ తాలూకా కు చెందిన ఫారుఖ్ ఖురేషీనుంచి నిజామాబాద్ కు చెందిన మేరాజ్ గంజాయి కొనుగోలుచేసి స్థానికంగా విక్రయాలు చేస్తున్నట్టు విచారణలో తెలిందని ఎన్ ఫోర్స్ మెంట్ సిఐ తెలిపారు. ఫారుక్ పరారీలో ఉన్నాడనిత్వరలో పట్టుకుంటామని సీఐ స్పష్టం చేశారు.. ఈ తనిఖీలలో ఎస్ఐ నర్సింహచారీ, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ నారాయణరెడ్డి, విష్ణూ, భూమన్న, అవినాష్,బోజన్న, ఉత్తమ్, శ్యామ్ తదితరులు ఉన్నారు.
భోకర్ నుంచి నిజామాబాద్ కు గంజాయి రవాణా – యువకుడి అరెస్ట్….6.5 కిలోల గంజాయి స్వాధీనం.
Published On: August 12, 2025 10:38 pm









