బాన్సువాడ జై భారత్ జూలై 19 : అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని రెడ్డి సంఘంలో బాన్సువాడ, బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాల లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,అర్హులైన నిరుపేదలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు అందజేస్తుందన్నారు. మొదటి విడతలో 1599 మందికి నూతన రేషన్ కార్డులు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, బీర్కూరు ఏఎంసీ చైర్మన్ శ్యామల, మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్, నార్ల సురేష్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం–ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
Published On: July 20, 2025 12:32 am
