నందిపేట్ జై భారత్ జూన్ 9: ( షేక్ గౌస్) నందిపేట్ మండలంలోని తల్వేద గ్రామం నుండి నందిపేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారిలో సోమవారం రాత్రి బలమైన గాలుల కారణంగా చెట్లు రోడ్డుపై పడిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.విషయం తెలుసుకున్న నందిపేట్ ఎస్‌ఐ చిరంజీవి తన సిబ్బందితో వెంటనే రోడ్ పై చెట్లు పడిపోయిన స్థలానికి చేరుకున్నారు. జేసీపీ సహాయంతో చెట్టును తొలగించి రోడ్డును క్లియర్ చేశారు. పోలీసులు వేగంగా స్పందించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ చిరంజీవి మాట్లాడుతూ, “ఇలాంటి ఆపత్కాల పరిస్థితుల్లో ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే అవసరమైన సహాయం వెంటనే అందిస్తాం” అని పేర్కొన్నారు. ప్రజల భద్రత, సౌకర్యం కోసం పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు