బ్రిడ్జిపై వడ్ల కుప్పలు – ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాలా?

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే : 4 (షేక్ గౌస్)
ఆలూరు నుండి ఆర్మూర్‌కు వెళ్లే ప్రధాన రహదారిలోని బ్రిడ్జిపై ఓ రైతు వడ్లను ఆరబోశాడు. వడ్ల కుప్పలతో పాటు చెట్లు, ఇతర వస్తువులను అడ్డంగా ఉంచడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.శనివారం ఒక బైక్ వడ్ల కుప్పకు అడ్డంగా ఉన్న చెట్టును ఢీకొనబోయి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ దృశ్యం చూసిన ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఈ రహదారిపై ప్రతిరోజూ వందలాది వాహనాలు సాగనెత్తుతుంటే, బ్రిడ్జిపైనే వడ్లు ఆరబోశారని అనడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమేనని వారు అభిప్రాయపడుతున్నారు. రైతుల పట్ల అందరికీ గౌరవం ఉన్నా, ప్రజల ప్రాణాలు మరింత విలువైనవని, ఇటువంటి నిర్లక్ష్యానికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!