నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-25
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్., ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అడిషనల్ డీ.సీ.పీ. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గోవింద్ స్పెషల్ పార్టీ సిబ్బంది కలిసి బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మందర్న గ్రామ శివారులో గల అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 9 టిప్పర్లను మరియు 03 జేసిబి ల పై రైడ్ చేసి స్వాధీనం పరుచుకోవడం జరిగింది.
ఈ దాడిలో స్వాధీనం చేసుకున్నవి ఈ దిగువ విధముగా గలవు.9 టిప్పర్లు, 03 జెసిబి లు 12 మంది డ్రైవర్లను అదుపులోకి తీసుకొని తదుపరి చర్య నిమిత్తం బోధన్ రూరల్ ఎస్ హెచ్ ఓ కి అప్పగించడమైనది.