నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:-18
తాగిన మైకంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన వాగ్వాదం గొడ్డలితో వేటు వరకు దారితీసింది. ఈ ఘటన మాక్లూర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కల్లెడ గ్రామానికి చెందిన దేవతి పోశెట్టి అనే వ్యక్తి సోమవారం దుబాయ్ వెళ్లాల్సి ఉండగా, తన స్నేహితుడైన తెడ్డు లింగం ఇంట్లో దావత్ ఇచ్చాడు. దేవతి పోశెట్టి, తెడ్డు లింగం ఇద్దరికి మద్యం మత్తులో గొడవ జరిగింది. దీంతో లింగం, పోశెట్టిపై గొడ్డలితో దాడిచేశాడు.