నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 25.
మండలం జాలాల్పూర్, జకోర్, అలాగే డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లి గ్రామాల్లో ఐజీడీ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ డెవలప్మెంట్) సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలజాత కార్యక్రమం ద్వారా ఆరోగ్య అవగాహన కల్పించారు.అయోడిన్ లోపం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా జరిగే ప్రయోజనాల గురించి ప్రజలకు వివరించారు. సమతుల్య ఆహారం అనేది చురుకైన జీవితానికి మూలస్తంభమని తెలిపారు. శక్తి ఉత్పత్తి, కణజాలం, జీవక్రియ నియంత్రణ, రోగనిరోధక శక్తి వ్యవస్థ పనితీరులో ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుందని వివరించారు.విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అందించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితానికి తోడ్పాటును అందిస్తాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కె. సమత, ఫీల్డ్ వర్కర్లు వై. గంగా, కె. నారాయణ తదితరులు పాల్గొన్నారు.












