రోడ్ భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆటోలలో డ్రైవర్ కి ఇరువైపుల అదనపు సీట్ల తొలగింపు

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 13 .

ఈ రోజు నిజామాబాద్ బోధన్ బస్టాండు వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, SI చంద్రమోహన్, రహమతుల్లా మరియు సిబ్బంది ట్రాఫిక్ నియమాలపైన ఆటో డ్రైవర్ల కి అవగాహన కల్పించడం జరిగినది ఇట్టి కార్యక్రమములో అదనపు ప్యాసింజర్స్ ని కూర్చొనివ్వద్దని , డ్రైవర్స్ కి ఇరువైపుల అదనపు సీట్స్ పైన ప్రయాణీకులను అనుమతించవద్దని , ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, డ్రైవర్స్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగివుండాలని, వూఫర్  బాక్స్ ఆటోలలో ఉంచి సౌండ్ పొల్యూషన్ కలిగించవద్దని పలుసూచనలు తెలిపారు, తదుపరి 20 ఆటోలలో డ్రైవరుకి  ఇరువైపుల అదనపు సీట్లు తొలగించి ఇంకోసారి ప్యాసింజర్స్ నీ డ్రైవర్ ప్రక్కన అనుమతించరాదని హెచ్చరించారు, లేని యెడల చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడునని తెలిపినారు.

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!