నిజామాబాద్ కమిషనరేట్ లో సైబర్ క్రైమ్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 24

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ హైదరాబాద్ వారి ఆదేశానుసారంగా నేడు నిజామాబాద్ ఇంచార్జీపోలీస్ కమీషనర్ శ్రీమతి సింధూశర్మ, ఐ.పి.యస్ సూచనలమెరకు నేడు నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సైబర్ క్రైమ్ సిబ్బందిని చైతన్యం చేయడం కోసం అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్) జి. బస్వారెడ్డి పర్యవేక్షణలో సైబర్ క్రైమ్ ఎ.సి.పి శ్రీ వై. వెంకటేశ్వర రావు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్) మాట్లాడుతూ, సాంకేతిక వినియోగం ఎక్కువ కావడం వల్ల సైబర్ నేరాల సంఖ్య అదే స్థాయిలో పెరిగి పోయిందని, సైబర్ నేరాలకు చెక్ పెట్టడం, సైబర్ క్రైమ్ సిబ్బంది సమర్ధవంతంగా సేవలందించడం లక్ష్యంగా పని చేయాలని , సైబర్ క్రైమ్ సిబ్బంది గ్రామ గ్రామాన అవగాహణ కార్యక్రమాలు చేపట్టాలని. ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్టు అని చాలా ఫోన్లు వస్తున్నందున అసలు డిజిటల్ అరెస్టులు అనేది ఎక్కడ లేదని ఇందు కోసమే పోలీస్ శాఖ ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి 1930 ద్వారా కూడా సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేయవచ్చని ప్రధానంగా భాదితులు డబ్బులు పోయిన వెంటనే ఫిర్యాదుచేయడానికి ముందుకు రావాలని, మోసపూరిత లావాదేవీలు జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే వాటిని తక్షణం నిలిపి వేసి సంబంధిత వారి యొక్క ఖాతా ను ఫ్రీజు చేసే విధంగా చూడాలని, సైబర్ నేరాల కేసుల్లో పూర్తి స్థాయి ఆధారాలను సేకరించి నేరస్థులను గుర్తించాలని, వారికి శిక్ష పడేలా చేయడం తద్వారా భాధితులకున్యాయం చేయాలని సూచించారు. ఇందుకోసం నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల లలో ప్రజలకు అవగాహణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు.ఈ కార్యాక్రమంలో సైబర్ క్రైమ్ పోలీసులు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యాక్రమంలో సైబర్ క్రైమ్ ఎ.సి.పి శ్రీ వై. వెంకటేశ్వర రావు నిజామాబాద్ ఎ.సి.పి. శ్రీ రాజా వెంకట్ రెడ్డి, టౌన్ సి.ఐ శ్రీ శ్రీనివాస్ రాజ్, డిచ్పల్లి సి.ఐ శ్రీ మల్లేష్ సైబర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ ముకీద్ పాషా*, సి.సి.ఆర్.బి సిబ్బంది మరియు సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!