తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 9.
తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చారని భారాస ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి దుశ్చర్యతో తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోందని మండిపడ్డారు. విగ్రహం నుంచి బతుకమ్మను మాయం చేశారని.. తెలంగాణ ప్రత్యేకత లేకుండా చేశారని చెప్పారు. ఆమెకు నివాళులర్పించే అర్హత రేవంత్‌రెడ్డికి లేదని కవిత పేర్కొన్నారు.