నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర మంత్రి కొండా సురేఖ

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 26 : ఆదివారం వరంగల్, హన్మకొండ జిల్లాల్లో జరిగిన పలు వివాహ వేడుకల్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ పాల్గొన్నారు. హనుమకొండ లోని ఎస్ వి కన్వెన్షన్ హాల్ మరియు కరీంబాద్ పోర్టు వరంగల్ లోని అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ మరియు ములుగు రోడ్ లోని వజ్రా గార్డెన్ లలో జరిగిన వివాహ వేడుకలలో మంత్రి కొండా సురేఖ పాల్గొని, ఆహ్వానితులతో సరదాగా గడిపారు. నూతన దంపతులకు నూతన వస్త్రాలు బహూకరించి నిండు మనసుతో ఆశీర్వదించారు. మంత్రి కొండా సురేఖకు ఆహ్వానితులు ఘనస్వాగతం పలికారు. మంత్రితో ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. అపురూప క్షణాలను కెమెరాల్లో బంధించారు. కష్టసుఖాల్లో తమ వెంట నడిచే సురేఖమ్మ సదా తమ గుండెల్లో వుంటుందని వారు భావోద్వేగానికి లోనయ్యారు. తన పై ఎంతో అభిమానం, ఆప్యాయత, అనురాగాలను ప్రదర్శిస్తూ, తన వెంట నడిచే వ్యక్తులు దొరకడం తన పూర్వజన్మ సుకృతమని మంత్రి సురేఖ అభిప్రాయపడ్డారు.

Join WhatsApp

Join Now

Leave a Comment