ఉమ్మడి సదాశివనగర్ మండల మాజీ జెడ్పిటిసి పడిగెల రాజేశ్వరరావు డిమాండ్.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : (నవీన్ కుమార్) రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పండించిన మొక్కజొన్నలను కొనుగోలు చేస్తామని ఆధారబాదరుగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు కానీ ఇంతవరకుగన్ని సంచులు సరఫరా చేయకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద కాంటలు ప్రారంభం కాకపోవడంతో రైతులు నరక యాతనం అనుభవిస్తున్నారన్నారు ఒకవైపు ప్రకృతి కన్నెర్రతో వర్షాలు పడి చేతికొచ్చిన పంట తడిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తుంటే మరోవైపుప్రభుత్వం మాటలు తప్ప చేతలు లేవని దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు ఇంతవరకు గన్ని సంచులు సెంటర్లకు పంపిణీ చేయకపోవడం చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు పండించిన పంట కొనుగోలు చేయడంలో చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆయన ఆరోపించారు పడుతున్నారని మండలంలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న పంటను ఆరబోసి వర్షాలకు తడిసిపోయిన ధాన్యాన్ని స్వయంగా పర్యవేక్షించడానికిసెంటర్లలో ఆయన పర్యటించి రైతుల బాధలు తెలుసుకున్నారు ఈ విషయమై కొనుగోలు ఎందుకు ప్రారంభించలేదని సిబ్బంది ఫోన్ ద్వారా ప్రశ్నించగా గన్ని సంచులు రానందున తాము కొనుగోలు చేయలేకపోతున్నామని సొసైటీ సిబ్బంది సమాధానం ఇవ్వడం చూస్తే ప్రభుత్వం చెప్పేది ఒకటి ఆచరణలో అమలు చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు ఒకపక్క రైతులు అకాల వర్షాల వల్ల చేతికి వచ్చిన పంట కండ్ల ముందే తడిసి పోవడంతో చేసేదేం లేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అంతేకాకుండా రాత్రింబవళ్లు సెంట్రల్ రా వద్ద కాపలా ఉంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వము దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమన్నారు ఒకవైపు మొక్కజొన్న మరోవైపు వడ్లు కల్లాల వద్ద తడిసిపోయి రైతులు అన్నము రామచంద్ర అంటూ ఆవేదన చెందుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అధికారులకు చీమకుట్టినట్టు కూడా లేదన్నారు ఈరోజు భూంపల్లి సెంటర్ ను పరిశీలించగా ఇప్పటివరకు కొనుగోలు ప్రారంభం కాలేదని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు తాము కళ్ళల వద్ద ధాన్యం తెచ్చి 15 రోజులైనా ప్రభుత్వం కొనుగోలు ప్రారంభించడం లేదన్నారుప్రకటించడం తప్పక్షేత్రస్థాయిలో కొనుగోలు చేయడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు దీంతో తప్పని పరిస్థితుల్లో 1800 కింటల్ చొప్పున మధ్య దళారులకు అమ్ముకొని నష్టపోతున్నామని రైతు ఆవేదన వ్యక్తం చేశారు ఒకవైపు మొక్కజొన్నకు 2400 మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టాన్ని గురవుతున్నారు అన్నారుఇప్పటికైనా ప్రభుత్వం జిల్లా యంత్రాంగం రైతుల బాధలను అర్థం చేసుకొని వెంటనే కొనుగోలు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు ఆయన వెంట టిఆర్ఎస్ సీనియర్ నాయకులు సాయ గౌడ్ గైని రమేష్ ఇందల్వాయి పండరి ఇందల్వాయి గంగాధర్ సుధాకర్ రావు గొల్ల మల్లయ్య శ్రీనివాస్ మగ్గం రమేష్ తదితరులు పాల్గొన్నారు.









