అవయవ దానం చేసిన వారు గొప్పవారు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 29 : (నవీన్ కుమార్) అవయవ దానం చేసిన వారు గొప్పవారని రాకేష్ రెడ్డి అన్నారు. బుధవారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి డొంకేశ్వర్ మండలం గంగ సముంధర గ్రామానికి చెందిన సాయవ్వ నిన్న మరణించడంతో వారి ఇంటికి వెళ్ళి పరమార్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సాయవ్వ మరణించిన నలుగురి జీవితాలలో ఇంకా బ్రతికి ఉంది అని అవయవాలు దానం చేసిన కుటుంబ సభ్యులు చాలా గొప్పవారు అని అన్నారు .అనంతరం డొంకశ్వర్ లో ఇటీవల మరణించిన వారి కుటుంబాల ఇండ్లకు వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు చిన్న రెడ్డి,కళ్ళే సంతోష్ రెడ్డి, చిన్న తదితరులు పాల్గొన్నారు.









