నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 25 : మంగళవారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి సాయి చైతన్య ఆదేశాలమేరకు రెంజల్ మండలంలోని నీల గ్రామం మరియు కందకుర్తి గ్రామాలలో సమస్యత్మక ప్రాంతాల దృష్ట్యా రాబోయే ఎలక్షన్లు శాంతియుత వాతావరణంలో ఎటువంటి భయభ్రాంతులకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించు కోవాలని ప్రజలకు భద్రత కల్పిస్తూ మంగళవారం శ్రీనివాస్ బోధన్ ఏసిపి మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, రేంజల్ ఎస్సై చంద్రమోహన్ అదే విధంగా విలేజ్ పోలీస్ ఆఫీసర్ కలిసి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ప్రజలకు భద్రత తో పాటు ఎలక్షన్లు శాంతియుత వాతావరణం లో ఎవరికి భయపడకుండా దేనికి లొంగకుండా ప్రశాంత వాతావరణంలో జరపాలని ఏసిపి శ్రీనివాస్ ప్రజలకు తెలియజేశారు.ఇట్టి కార్యక్రమంలో నీలా మరియు కందకుర్తి గ్రామల అన్ని పార్టీల సభ్యులు మరి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
రేంజల్ మండలంలోని నీల మరియు కందకుర్తి గ్రామాల్లో రాబోయే ఎలక్షన్ గురించి అవగాహన సదస్సు
Updated On: November 25, 2025 9:30 pm











