తప్పిపోయిన వ్యక్తి మృతదేహంగ లభ్యం..

మోపాల్ ఎస్ఐ జెడ్ సుష్మిత వెల్లడి

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 27 : శుక్రవారం ఉదయం సుమారు 08:00 గంటల ప్రాంతంలో సిర్పూర్ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి సిర్పూర్ గ్రామ గుట్ట వద్ద గొర్రెలను మేతకు తీసుకెళ్లగా అక్కడ ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని గమనించాడు. వెంటనే గ్రామస్థులకు మరియు పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న మోపాల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం పక్కన ఉన్న వస్తువులు మరియు దుస్తులను పరిశీలించగ మృతదేహం మోపాల్ పోలీస్ స్టేషన్‌లో నవంబర్ నెలలో నమోదు చేసిన మిస్సింగ్ కేసు క్రైమ్ నెంబర్ 170/2025 లో గల్లంతైన ఈర్ల సాయిలు , తండ్రి: లేట్ చిన్నులు, వయస్సు: 64 సంవత్సరాలు, కులం: ముదిరాజ్, వృత్తి: వ్యవసాయం , నివాసం: సిర్పూర్ గ్రామం, మోపాల్ మండలం చెందినవారని గుర్తించారు. అనంతరం సంఘటనా స్థలంలో పంచనామా నిర్వహించి, వైద్యులచే అక్కడే పోస్ట్‌మార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారని మోపాల్ ఎస్ఐ జెడ్. సుష్మిత తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment