మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ సెంటర్ ను పరిశీలించిన పోలీస్ కమిషనర్

నామినేషన్ సెంటర్ల వద్ద పటిష్టమైన పోలీస్ బందొబస్త్ ఏర్పాట్లు

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 28 : నిజామాబాద్ జిల్లా లోని మున్సిపల్ కార్పొరేషన్  ఎన్నికలు 2026 లో భాగంగా నేడు నిజామాబాద్ డివిజన్ లోని నాలుగోవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని TTD కళ్యాణ మండపం లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రం ను  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  నామినేషన్ల స్వీకరణ కేంద్రంను పరిశీలించి , నామినేషన్ ప్రక్రియను గురించి తెలుసుకొని , పోలీస్ సిబ్బంది కి నామినేషన్ సెంటర్ దగ్గరలో 100 మీ.ల లోపు నిషేధిత ఉత్తర్వులు అమలులో ఉంటాయని , అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ని పాటించాలని , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్బంగా నిజామాబాదు ఎ.సి.పి  బి. ప్రకాష్ , టౌన్ 4 ఎస్.హెచ్.ఓ  సతీష్ కుమార్, ఆర్.ఓ  వెంకటేష్ , ఏ.ఆర్.ఓ  రమేష్ గౌడ్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment