నందిపేట్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక జనవరి 3: (షేక్ గౌస్) నందిపేట్ మండల కేంద్రానికి చెందిన రాగల గంగామణి (40), కులం చాకలి అనే మహిళ మృతదేహం తల్వేద గ్రామ పరిధిలోని వాగులో శనివారం ఉదయం లభ్యమైంది. స్థానికులు గమనించి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. ఆమె తలపై బలమైన ఆయుధంతో కొట్టినట్లుగా గాయాలు కనిపించడంతో ఇది హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ ఘటనపై మృతురాలి కూతురు రాగల మేఘన నందిపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తమ గ్రామానికి చెందిన స్వరూప, లావణ్య, ప్రేమలతో పాటు ప్రేమల భర్త నరేష్‌లు తన తల్లిని బాసరకు తీసుకువెళ్తామని నమ్మించి, బలమైన ఆయుధంతో తలపై కొట్టి హత్య చేసి వాగులో పడేశారని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదులో పేర్కొంది.ఫిర్యాదు మేరకు నందిపేట్ ఎస్ఐ శ్యామ్‌రాజ్ హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకోడానికి సిఐ శ్రీధర్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిసింది.
వాగులో మహిళ మృతదేహం..హత్యగా అనుమానం
Published On: January 3, 2026 9:09 pm









