మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య – అవయవ దానంతో దాతృత్వం

నందిపేట్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 30 (షేక్ గౌస్) నందిపేట మండలంలోని బాద్గుణ గ్రామంలో మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన బరికుంట సన్నిత్ (17)పై దొంగతనం చేశాడని ఆరోపణలు రావడంతో తీవ్రంగా మనస్థాపం చెందినట్లు సమాచారం.డిసెంబర్ 27న సన్నిత్ గడ్డి మందు తాగగా కుటుంబ సభ్యులు గమనించి వెంటనే నందిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.ఈ ఘటనపై నందిపేట పోలీస్ స్టేషన్ ఎస్సై శ్యామ్ రాజ్ బరికుంట ముత్తన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలు, ఆరోపణల నేపథ్యాన్ని విచారణలో తేల్చనున్నట్లు పోలీసులు తెలిపారు.అవయవ దానం – మానవతకు నిలువెత్తు ఉదాహరణ తమ కుమారుడి అకాల మరణంతో తీవ్రంగా కలచివేసినప్పటికీ, సన్నిత్ తల్లిదండ్రులు గొప్ప మనసుతో తమ కుమారుడి అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు. సన్నిత్ అవయవ దానం ద్వారా పలువురి ప్రాణాలు నిలబడే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఈ దాతృత్వ నిర్ణయంపై గ్రామస్తులు, స్థానికులు సన్నిత్ తల్లిదండ్రులను అభినందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment