స్విమ్మింగ్ లో రాష్ట్రస్థాయి పథకాలు సాధించిన వారికి  సన్మానించినా పోలీస్ కమిషనర్

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 30 : మంగళవారం మాగ్పాల్ పోలీస్ స్టేషన్ యందు విధులు నిర్వహిస్తున్నటువంటి హరికృష్ణ పిసి   పిల్లల అయినా మధి మోహన్ దుర్గ మరియు మధి వినమ్ర లు స్విమ్మింగ్ పోటీలో ఈ మధ్యకాలంలో రాష్ట్రస్థాయిలో అనేక పథకాలు సాధించినందుకు  నేడు పోలీస్ కమిషనర్ కార్యాలయం యందు మాది మహన్ దుర్గ, మది వినమ్ర, మరియు కోచ్ ఫరూఖ్ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్  సాయి చైతన్య  ఘనముగా సన్మానించి , అభినందించడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ నిజామాబాదు కు పథకలు తెచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని, వీరి కృషి వలన రాష్ట్రంలో నే నిజామాబాద్ కు ఎంతో మంచి పేరు వచ్చిందని ఇదేవిధంగా జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో జరిగే స్విమ్మింగ్ పోటీలలో మన తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక పథకాలు సాధించడానికి కృషి చేయాలని కొనియాడుతూ వీరిని అభినందించడం జరిగింది .అలాగే క్రీడల పట్ల సిబ్బందికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు ప్రోత్సాహకాలు అందిస్తామని వారికి ఎలాంటి సందేహాలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని  తెలిపారు. మరియు పోలీస్ సిబ్బంది అందరూ క్రీడలు మరియు స్విమ్మింగ్ పట్ల సమయం కేటాయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్  జి బస్వా రెడ్డి , నిజామాబాదు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, సౌత్ రూరల్ సిఐ ఎన్.సురేష్ కుమార్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment