జీవో 252 ను వ్యతిరేకిస్తున్నాం–అక్రెడిటేషన్ కార్డులివ్వాలి డెస్క్ జర్నలిస్టులకు

నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల నిరసన

నిజామాబాద్ జిల్లా బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : తమకు పాత పద్ధతిలోనే అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డెస్క్ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు.రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జిఓ 252 జర్నలిస్టుల ను విభజించేవిధంగా ఉందని శనివారం నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద డీజేఎఫ్ టీ (ఉమ్మడి నిజామాబాద్ జిల్లా) శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డెస్క్ జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రభుత్వం డెస్క్ జరల్నిస్టులకు అన్యాయం చేయాలని చూస్తుందన్నారు.ఇందుకోసమే జీవో 252ను తీసుకువచ్చిందని ఆరోపించారు. అక్రెడిటేషన్ కార్డు, మీడియా కార్డు పేరుతో జర్నలిస్టులను విడదీయాలని కుట్ర పన్నిందని మండిపడ్డారు. తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి మరీ రాత్రి సమయంలో పనిచేస్తున్న తమను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరులు, డెస్క్ జర్నలిస్టులు కలిసి పనిచేస్తేనే జర్నలిజం అవుతుందన్నారు. కానీ సర్కారు మాత్రం వివక్ష చూపిస్తోందని.. ఇది సరైనది కాదని పేర్కొన్నారు. జీవో 252ను రద్దు చేసి, పాత పద్ధతిలోనే అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తప్పదని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment