మొక్కజొన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ – కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 12 : (నవీన్ కుమార్) మొక్కజొన్న విక్రయాలు జరిపిన రైతుల బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం తొలి విడత డబ్బులు జమ చేసిందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని మొక్కజొన్న రైతులకు తొలి విడతగా రూ.10.00 కోట్ల నిధులు విడుదల అయ్యాయని పేర్కొన్నారు. మార్క్ ఫెడ్ ద్వారా జిల్లాలో 33 కొనుగోలు కేంద్రాలను నెలకొల్పి 2,63,016 క్వింటాళ్ళ మొక్కజొన్న సేకరించమన్నారు. క్వింటాలుకు మద్దతు ధర రూ. 2400 చొప్పున ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తోందని తెలిపారు. మిగతా మొక్కజొన్న నిల్వలకు సంబంధించి కూడా వెంటవెంటనే ప్రభుత్వం రైతుల ఖాతాలలో బిల్లులు జమ చేయనుందన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment