నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 07 : (నవీన్ కుమార్) గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రెండవ విడత ఎన్నికలు జరుగనున్న మండలాల పోలింగ్ సిబ్బంది మలి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్ లాల్ సమక్షంలో నిర్వహించారు ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ నిర్వహించిన ఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్లు నిశితంగా పరిశీలించారు. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ లోని ఒక్కో మండలం వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓ.పీ.ఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ నాటికే ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు స్థానాలతో కూడిన గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరపాల్సిన అవసరం లేకపోవడం వల్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ నుండి మినహాయింపు కల్పించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశారు. రెండవ విడతలో 1476 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎన్నికలు జరుగనుండగా, 20 శాతం అదనంగా సిబ్బందిని రిజర్వ్ లో ఉంచుతూ ర్యాండమైజేషన్ జరిపారు.
కలెక్టర్, అబ్జర్వర్ సమక్షంలో రెండవ విడత ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్
Published On: December 7, 2025 11:10 pm











