హోంగార్డుల ఆరోగ్యం, ఆర్థిక భద్రత కోసం ఆరోగ్య బీమా: అదనపు డీసీపీ

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : హోంగార్డులు ఆరోగ్య భద్రతపై దృష్టి పెట్టాలని అదనపు డీసీపీ రామచంద్ర రావు పేర్కొన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో హోంగార్డులకు హెల్త్ కార్డులపై అవగాహన కల్పించారు.చిన్నచిన్న అనారోగ్య సమస్యలు కూడా భారంగా మారకుండా హోంగార్డులకు బీమా అవసరమని అదనపు డీసీపీ రామచంద్రరావు అన్నారు. సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో అదనపు డీసీపీ హోంగార్డుల ఆరోగ్య బీమాపై అవగాహన కల్పించారు.యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాల గురించి, పోలీసు కుటుంబాల ఆరోగ్య భద్రతను బలోపేతం చేసే మార్గాలపై ప్రతిపాదనలు చేశారు. అనంతరం అదనపు డీసీపీ(ఏఆర్) మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో అత్యంత ముఖ్య భూమిక పోషించే హోంగార్డులు ఆరోగ్యంగా, ఆర్థికంగా భద్రంగా ఉండాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment