ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 19 : (నవీన్ కుమార్) బుధవారం ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కాసం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి సైదులు రెడ్డి సమక్షంలో జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షులు సాయి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నరేందర్, ముఖ్య సలహాదారులుగా కృపాల్ సింగ్ సోడి ను సర్వసభ్య సమావేశంలో ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా కృపాల్ సింగ్ సోడి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ప్రాతినిత్యం చేస్తూ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తానని నూతన పిఆర్సి అమలు చేయాలని, పెండింగ్ డి ఏ లు విడుదల చేయాలని , పెన్షన్ బెనిఫిట్స్ చెల్లించాలని, టెట్ మినహాయింపు ఇవ్వాలని, ఈ హెచ్ ఎస్ సౌకర్యం కల్పించాలని, ఎఫ్ ఆర్ ఎస్ తొలగించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హరి శంకర్ , స్వామి, బాలరాజు, యాదయ్య తో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు
నగరం లో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశం.
Published On: November 19, 2025 10:16 pm











