ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 19 : (నవీన్ కుమార్) నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్ల లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తుండడంతో మున్సిపల్ అధికారుల గుండెల్లో అలజడి మొదలయ్యింది. బుధవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ అధికారులు ముకుమ్మడిగా టౌన్ ప్లాన్ సెక్షన్లలకి వచ్చి ప్రధాన ద్వారం లోపల నుంచి గడియపెట్టుకొని సోదాలు నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలకు వత్తాసు పలుకుతు, మామూళ్ల మత్తులో అనుమతులు ఇస్తున్నారని ఇటీవల టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులపై వరుసగా అవినీతి ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు కాసేపట్లో అధికారులు వెల్లడించనున్నారు.
బల్దియా టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ఏసీబీ సోదాల అలజడి.
Published On: November 19, 2025 9:10 pm











