ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 11 : మోపాల్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపి ముగ్గురు చిట్టి నారాయణ, నివాసం ఆరేపల్లి డిచ్పల్లి మండలం, బూస భానుచందర్ కులాస్పూర్ నివాసి, కేతావత్ మహాపాతలాల్ బైరాపూర్ గ్రామానికి చెందిన మంగళవారం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందర హాజరపరుచగా చిట్టి నారాయణ కి రెండు రోజులు, బుస భానుచందర్ కి మూడు రోజులు కేతావత్ మహాపాత లాల్ కి ఏడు రోజుల జైలు శిక్ష విధించారని మోపాల్ ఎస్సై జెడ్. సుస్మిత తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మద్యం తాగి వాహనం నడపడం వల్ల తమ ప్రాణాలకే కాదు రోడ్డుపై ఉన్న ఇతరుల ప్రాణాలకు హాని కలిగిస్తుందని. ఇకముందు ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా తెలియజేశారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన ముగ్గురికి జైలు శిక్ష–మోపాల్ ఎస్సై జెడ్ సుస్మిత
Published On: November 12, 2025 9:51 am









