రైస్ పులింగ్ చెంబు పేరిట ఘరానా మోసం–75 లక్షలకు టోకరా వేసిన నిందితుని అరెస్ట్.

వివరాలు వెల్లడించిన నందిపేట్ ఎస్సై శ్యామ్ రాజ్.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 11 : (నవీన్ కుమార్) రైస్ పులింగ్ చెంబు తో అద్భుతాలు సృష్టించి, కోట్లు గడించవచ్చని నమ్మబలికి 75 లక్షలకు టోకరా వేసిన నిందితున్ని అరెస్టు చేసినట్లు నందిపేట ఎస్సై శ్యామ్ రాజు వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు.గత జులై 13 వ తేదీన దమ్మన్నగారి సాయి కృష్ణ నందిపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. అతను ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, అతని బావ హైదరాబాద్ కు చెందిన నర్సింగరావు తో, నెల్లూరు జిల్లాకు చెందిన .ఎతిరాజుల రాఘవేంద్ర ఇతను ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. మరో వ్యక్తి శ్రీరామరాజు ఇద్దరూ పరిచయం పెంచుకున్నారు. వీరు “రైస్ పులింగ్ చంబు” ఉందని నమ్మబలికి, ఫిర్యాదుదారుడు దమ్మున్న గారి సాయి కృష్ణ నుండి మొత్తం రూ. 75 లక్షలు మోసపూరితంగా స్వీకరించినట్లు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.ఈ ఫిర్యాదు ఆధారంగా నందిపేట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా, పక్కా సమాచారం మేరకు, నవంబర్ 10వ తేదీన తాను తన సిబ్బందితో కలిసి హైదరాబాద్ లోని కూకట్పల్లి బస్ స్టాప్ వద్ద ఏ1) ఎతిరాజుల రాఘవేంద్ర ను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. అరెస్టు సమయంలో నేరానికి సంబంధించిన మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు శ్రీరామరాజు, నర్సింగరావు పరారీలో ఉన్నారని వారి కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు శ్యామ్ రాజ్ వెల్లడించారు.రైస్ పులింగ్, అద్భుత శక్తులు, మంత్ర శక్తుల పేరుతో జరిగే మోసపూరిత ప్రకటనలకు లోను కావద్దన్నారు.ఇలాంటి మోసపూరిత ప్రలోభాలకు గురైనట్లయితే, వెంటనే సమీప పోలీస్ స్టేషన్ ను సంప్రదించగలరని ఎస్సై సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment