మున్సిపల్ ఫండ్స్ ను సక్రమంగా వినియోగించాలి

అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 01 : నగరంలో పనిచేయని స్ట్రీట్ లైట్లు తక్షణమే మరమ్మతు చేసి కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని, ఇటీవల విడుదలైన మున్సిపల్ ఫండ్స్ ను పూర్తిగా, సక్రమంగా వినియోగించాలి అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అధికారులకు సూచించారు. నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణ రెడ్డి తో కలిసి జిల్లా ముఖ్య విభాగాలపై విస్తృత సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. నగర శానిటేషన్ పనుల్లో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్ది పనులు వేగవంతం చేయాలని మున్సిపల్ కమీషనర్ కు ఆదేశించారు. నగరంలోని ప్రభుత్వ పాఠశాలలు, ముఖ్యంగా ఆడపిల్లల పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, ఇన్ఫాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్, అవసరమైన అంచనాలు, ప్రతిపాదనలు తక్షణమే సమర్పించాలి అని డీఈఓను ఆదేశించారు. టీయూఎఫ్ఎడీసీ నిధులతో జరుగుతున్న పనులు, ఆలస్యమవుతున్న నేపథ్యంలో, వాటిని తక్షణమే వేగవంతం చేసి పూర్తి చేయాలని అన్నారు. సోనీ ఫంక్షన్ హాల్ దగ్గర బ్రిడ్జి వర్క్ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఇందూరు నగరంలోని బస్తీ దవాఖానాల పని తీరు, సిబ్బంది హాజరు, ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఇటీవల జిల్లా ఆసుపత్రి అభివృద్ధికి మంజూరు చేసిన రూ.2.25 కోట్ల నిధులతో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. సంబంధిత అధికారులు టెండర్ ప్రక్రియను వేగవంతం చేసి పనులను త్వరగా ప్రారంభించాలని సూచించారు. మదర్,చైల్డ్ వెల్ఫేర్ హాస్పిటల్లో సఫీషియెంట్గా స్టాఫ్ ను రిక్రూట్ చేసుకుని త్వరితగతిన ప్రారంభించాలని ఆదేశించారు. జిల్లాలోని కుంటలు, చెరువులు,నీటిమడుగులపై జరిగిన ఆక్రమణలపై పూర్తి నివేదికని వెంటనే సమర్పించాలి అని ఆదేశించారు. ఆక్రమణలను తొలగించే దిశగా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అండర్ గ్రౌండ్ వర్క్స్ నత్తనడకన జరుగుతున్నాయని, నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగా డివిజన్ కు కోటి రూపాయలు నిధులు మంజూరు అయ్యాయని,వాటి టెండర్ ప్రక్రియ త్వరతిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ,విద్యాశాఖ, ఆర్ అండ్ బి, హెల్త్ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment