విద్యార్థులకు ఆన్లైన్ ఓపెన్ హౌజ్’పై అవగాహ

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలలో భాగంగా (ఫ్లాగ్ డే సందర్భంగా) గురువారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఓపెన్ హౌజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అన్నీ స్కూల్ విద్యార్థులకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు ఆన్లైన్ ద్వారా ఓపెన్ హౌజ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఆన్లైన్ ఓపెన్ హౌజ్ కార్యక్రమంలో రిసిప్షన్ కౌంటర్ ఏ విధంగా నిర్వహిస్తారో, సి.సి.టి.ఎన్.ఎస్ పనితీరు,ఫిర్యాదు దారుల నుండి ఫిర్యాదు ఏ విధంగా తీసుకొని వాటి పనితీరు ఏ విధంగా చేస్తారో,ఎఫ్.ఐ.ఆర్ నమోదు ఏ విధంగా చేస్తారో వాటి కాపీ ఏ విధంగా పొందాలో, డయల్ 100 పనితీరు,పెట్రోకార్ పనితీరు, నేరస్తున్ని పట్టుకున్న తరువాత అతని పూర్తి సమాచారం సేకరణ అట్టి సమాచారం ఏ విధంగా భద్రపరుచాలో, పోలీస్ స్టేషన్ రికార్డులు నిర్వాహణ, వాహనాల తనిఖీలుఏ విధంగా చేస్తారో, పోలీస్ స్టేషన్ సిబ్బంది విధులు, కమ్యూనికేషన్స్ విభాగాల గూర్చి క్షుణ్ణంగా తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment