ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 27: (నవీన్ కుమార్) బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవా రం ఉదయం అందాజ 5.30 గంటల సమయంలో బోధన్ మున్సీపాలిటిలో పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తున్న రాజం నాగమణిని ఆర్టీసి బస్సు ఢీ కొని మరణించిందని బోధన్ పట్టణ ఎస్ హెచ్ ఓ.వెంకట నారాయణ తెలిపారు.ఉదయం తన విదులలో భాగముగా అంబేద్కర్ చౌరస్తా వద్ద పారిశుధ్య పనులు చేస్తుండగా, అదే సమయంలో సంగారెడ్డి డిపోకి చెందిన టిజి 15 జడ్ 0070 నెంబర్ గల ఆర్టీసి బస్సు బోధన్ నుండి సంగారెడ్డి కి వెళ్తుండగా,డ్రైవర్ తన బస్సును అతి వేగముగా, ఆజాగ్రతగా నడిపి కార్మికురాలు రాజం నాగమణి ని “ఢీ” కొట్టగా తీవ్ర గాయాలు అయ్యాయని అన్నారు.చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయినది అని సీఐ తెలిపారు.ఈ సందర్భంగా మృతురా లి కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సిఐ వెంకటనారాయణ తెలిపారు.
బోధన్ లో ఆర్టిసీ బస్సు ఢీకొని పారిశుధ్య కార్మికురా లు మృతి
Published On: October 27, 2025 9:45 pm









