మోపాల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలు

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 26 : ఈ సందర్భంగా మోపాల్ ఎస్ హెచ్ ఓ సుస్మిత మాట్లాడుతూ మోపాల్ గ్రామ రైతు వేదిక నుండి మొదలై నర్సింగ్ పల్లి గ్రామపంచాయతీ వరకు నిర్వహించడం జరిగింది. ఇందులో 70 మంది పిల్లలు 40 మంది యువత రన్నింగ్ లో పాల్గొనడం జరిగింది మరియు దాదాపు 20 నుండి 40 వరకు పెద్దవాళ్లు బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది తెలియజేశారు. పోలీస్ అమరవీరులకు ఘనమైన నివాళి అర్పించుటకు పోలీసులు పిలుపుమేరకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడంలో సహకరించారు. రన్నింగ్ అనంతరం కార్యక్రమాన్ని నిర్వహించి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు వీరులను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది. దేశం కోసం ప్రజల రక్షణ కోసం తాము ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని పోలీసు వారు తెలియజేశారు. తర్వాత ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు యువత మరియు పెద్ద వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందించడం జరిగింది

Join WhatsApp

Join Now

Latest Stories

Leave a Comment