ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : నూతన మద్యం దుకాణాల లైసెన్సదారుల ఎంపికకు దరఖాస్తుల స్వీకరణ ఈనెల 23. తో ముగిసిందని ఎక్సైజ్ సూపరిటెండెంట్ మల్లారెడ్డి వెల్లడించారు.నిజామాబాద్ జిల్లాలో మొత్తం మద్యం దుకాణాలు 102 కాగా,జిల్లా వ్యాప్తంగా మొత్తం దరఖాస్తులు-2786.దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి 83.58 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు.నిజామాబాద్ జిల్లాలోని ఎరగట్ల మద్యం దుకాణానికి అత్యధికంగా 96 దరఖాస్తులు వచ్చాయని మల్లారెడ్డి తెలిపారు. అదేవిధంగా ఆలూరు మద్యం షాప్ కు 74 దరఖాస్తులు రాగా,వేల్పూర్ మద్యం షాప్ కు 69 వచ్చాయని వెల్లడించారు.హైదరాబాద్ రోడ్ లోని భారతీ గార్డెన్ లో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సమక్షంలో డ్రా పద్దతిలో లైసెన్స్ దారుల ఎంపిక జరుగుతుందన్నారు..ఎంపిక కాబడిన లైసెన్సుధారులు అదే రోజు 1/6 వ వంతు లైసెన్స్ ఫీజు ను భారతి గార్డెన్ లో ఏర్పాటు చేసిన బ్యాంకు కౌంటర్ లో చెల్లించాలని తెలిపారు.ఈనెల 27న ఉదయం 9.00 గంటలకు తమ హాల్ టికెట్ తో భారతి గార్డెన్ కు చేరుకోవాలని,.సెల్ఫోన్ లు లోపలకి అనుమతించబడవని మల్లారెడ్డి తెలిపారు..
మద్యం షాపుల కేటాయింపులు. వివరాలు వెల్లడించిన ఎక్సైజ్ సూపరిటెండెంట్ మల్లారెడ్డి
Published On: October 24, 2025 10:57 pm











