రోడ్లపై ధాన్యం ఆరబెట్టవద్దు.వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది రూరల్ ఎస్ఐ.మచ్చేందర్ రెడ్డి..

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 21: బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారుల ఫై పంట ధాన్యం ఆరబెట్టవద్దని రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి రైతులకు సూచించారు. రహదారిపై ధాన్యం కారణంగా వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని,గతంలో కొందరు వాహనదారులు ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు.రోడ్లపై ధాన్యం ఆరబెడితే వాహనాలు వడ్ల కుప్పలోకి దూసుకుపోయి అదుపు తప్పి ప్రమాదం వాటిల్లుతుందని,గాయాలు లేదా ప్రాణాలు కూడా పోతాయని అన్నారు. మనిషి ప్రాణం విలువైనదని, నిర్లక్ష్యం వల్ల కుటుంబాలు వీధిన పడతాయని అన్నారు.రోడ్లపై ఆరబెట్టిన ధాన్యాన్ని తక్షణమే తొలగించాలని రైతులకు రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment