ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ అక్టోబర్ 21 : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణ ప్రజలకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.దీపావళి పండుగ చీకట్లపై వెలుగుల విజయాన్ని సూచించే వేడుక.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దీపావళి పండుగ వెలుగులు ప్రతి ఇంటిని ఆనందంతో, ప్రతి హృదయాన్ని ఆశతో నింపాలని కోరుకుంటున్నాను. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, ప్రజల సంక్షేమం ఈ పండుగతో మరింతగా వృద్ధి చెందాలి,” అని తెలిపారు.అలాగే, “శ్రీరాముడు రాక్షసరాజు రావణుడిని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంలో వెలిగించిన దీపాలతో ప్రారంభమైన ఈ పండుగ చెడుపై మంచి గెలుపు అనే సందేశాన్ని ఈ పండుగ తరతరాలుగా మనకు అందిస్తుంది,” అన్నారు.
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే.
Published On: October 21, 2025 6:40 pm











