ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ అక్టోబర్ 19 : దీపావళి రానేవచ్చింది పండగ జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారు. దీపావళి రోజున దీపాలు వెలిగించడం ఆనవాయితీ. ఇందు కోసం మార్కెట్లో వినూత్న ఆకృతిలో ప్రమిదాలను విక్రయిస్తున్నారు. ఒక్క జత ప్రమిద ధర రూ.50 నుంచి రూ.250 వరకు పలుకుతున్నాయి. బంతిపూలకు కూడా బాగా డిమాండ్ పెరిగింది. సుమారు కేజీ రూ.100 నుండి రూ.200 పలుకుతుంది. దీంతోపాటు మిఠాయి షాపులు, టపాకాయలకు డిమాండ్ పెరిగింది.
దీప ప్రమిదలు.. దీపావళి కొత్త కాంతులు.
Published On: October 20, 2025 10:54 am











