వైభవంగా ప్రారంభమైన కళా ఉత్సవ్ .

నిజామాబాద్ జై భారత్ సెప్టెంబర్ 3 : జిల్లా విద్యాశాఖ, నిజామాబాద్ ఆధ్వర్యంలో జిల్లా బాల్ భవన్లో బుధవారం నాడు కళా ఉత్సవ్ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి పి. అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న కళా ప్రతిభను వెలికి తీసేందుకు జిల్లాస్థాయి కళా ఉత్సవ్ సాంస్కృతిక పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండు రోజులు సాగే ఈ పోటీలలో గ్రూప్ డాన్స్, సోలో డాన్స్ ,గ్రూప్ సాంగ్స్, సోలో సాంగ్, ఇన్స్ట్రుమెంటల్ ,స్కిట్ ,2డి ,3d డ్రాయింగ్ మొదలైన పోటీలు విద్యార్థులకు నిర్వహించనున్నామన్నారు. విద్యార్థులంతా ఈ కళా ఉత్సవంలో చైతన్యవంతంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. విద్యార్థులను సంసిద్ధులను చేసి తీసుకొచ్చిన ఉపాధ్యాయులను డీఈవో ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎమ్ఓ బాలకృష్ణారావు, నిజాంబాద్ అర్బన్ ఎంఈఓ సాయి రెడ్డి, జూరీ కమిటీ మెంబర్స్ లక్ష్మీనాథం ఆర్. గోపాలకృష్ణ ,కాసర్ల నరేష్ రావు ,లక్ష్మణ్, చింతల శ్రీనివాస్, డాక్టర్ శారద న్యాయ నిర్ణేతలు ఉమాబాల, స్వప్న రాణి, జయలక్ష్మి, పాయల్, గంట్యాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment