కృష్ణుడు నడిచిన ధర్మ మార్గం సమస్త మానవాళికి ఆదర్శం – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్.

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 16 :  శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్బంగా నగరంలో దుబ్బ శ్రీకృష్ణ దేవాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు ప్రతేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతు ధర్మసంస్థపన కొరకు శ్రీ మహా విష్ణువు ఒక్కొక్క యుగంలో ఒక్కో అవతారం ఎత్తుతారని ద్వాపర యుగంలో ఎనిమిదో అవతారంగా శ్రీ శ్రీకృష్ణుడు జన్మించాడని ప్రపంచాన్ని ధర్మ మార్గంలో నడిపించడానికి, ధర్మసంస్థపన కొరకు శ్రీ కృష్ణుడు నడిచిన ధర్మామార్గం సమస్త మానవాళికి నిదర్శం అన్నారు.మహాభారతం, భగవత్ గీత మొత్తం శ్రీ కృష్ణుని జీవిత వృతంషామే అన్నారు. ముఖ్యంగా భారతదేశం అంటేనే సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం అని చిన్నారుల దగ్గర నుండి యువతి యువకులు శ్రీ కృష్ణ, గోపిక వేశాధారణలో ఉట్టి కొట్టె కార్యక్రమాన్ని సంబరంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు.నేడు ప్రపంచ దేశాలలో కూడా కృష్ణాష్టమిని పెద్ద ఉత్సవంగా జరుపుకోవడం గర్వకారణం అన్నారు. ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని అన్నారు.గోవుని దేవతగా పూజించే హిందువులు హిందువుల ఆరాధ్య దైవం అయినా గోవులని రక్షించాలని ప్రతి హిందూ కుటుంబం గోవులను సంరక్షించుకోవాలని ఇంటికో గోమాతను పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వాలు గోవుల సంరక్షణకు కఠినమైన చట్టాలు తీసుకురావడమే కాకుండా వాటిని అమలు చేయాలన్నారు.దేశం ధర్మ మార్గం వైపు నడవడానికి ఆ కృష్ణుడి ఆశీర్వాదం దేశ ప్రజలందరి పై ఉండాలని , ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశ వేణు మరియు 16 డివిజన్ కార్పొరేటర్ పంచారెడ్డి ప్రవళిక, శ్రీధర్ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment