అంగన్వాడి సమస్యల పట్ల కలెక్టర్ ని కలిసిన టీఎన్జీవో నాయకులు

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : అంగన్వాడి సమస్యల పట్ల టీఎన్జీవోస్ జిల్లా నాయకులు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిశారు. మంగళవారం ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి అంగన్వాడి ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై చర్చించి వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరగా సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నరని తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ కి టీఎన్జీవోస్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఎన్జీవో ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు శశికాంత్ రెడ్డి, అంగన్వాడీ ఉద్యోగుల జిల్లా అధ్యక్షురాలు అనురాధ, కార్యదర్శి లక్ష్మి, కార్యవర్గ సభ్యులు రేఖ,గీత తదితరులు హాజరయ్యారు.

Join WhatsApp

Join Now

Leave a Comment