జలాల్ భుఖారి దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్.

బోధన్ జై భారత్ ఆగస్ట్ 11 : నేడు రాత్రి సమయంలో బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెంజల్ బేస్ సమీపంలో గల జలాల్ భుఖారి దర్గా ఉర్సు ఉత్సవాలు గత మూడు రోజుల నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నేడు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించినటువంటి  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్. ఈ సందర్భంగా ఉర్సు ఉత్సవాలు మరియు ఖవ్వాలి కార్యక్రమంలో పాల్గొని చాదర్  సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ ప్రజలందరూ సోదరా భావంతో మెలగాలని మరియు ప్రతి ఒక్కరు ఎల్లప్పుడూ పోలీసు వారికి సహకరించాలని తెలియజేశారు.ఈ సందర్భంగా బోధన్ ఏసిపి  పి. శ్రీనివాస్ , బోధన్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ వెంకటనారాయణ , రుద్రూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్  కృష్ణ , బోధన్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్  విజయబాబు మరియు ఎస్సైలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment