నిజామాబాద్ జై భారత్ జూలై 29 : నేడు IDOC కలెక్టర్ ఆఫీస్ నందు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, మరియు రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ను, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, I.P.S. మర్యాదపూర్వకంగా కలిసి పువ్వుల మొక్క ను అందజేశారు.

నిజామాబాద్ నగరానికి విచ్చేసిన మంత్రి సీతక్క నిజామాబాద్ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో, వైద్య ఆరోగ్య శాఖ, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు మరియు భూభారతి పధకలపై నిజామాబాద్ కలెక్టర్ కార్యలయం లో సమన్వయ సమావేశము నిర్వహించారు ఈ సమావేశనికి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క , ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ ఆలీ షబ్బీర్ నేతృత్వంలో వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యే లు పోచారం శ్రీనివాస్ రెడ్డి , భూపాతి రెడ్డి , సుదర్శన్ రెడ్డి , సూర్యనారాయణ , రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.











