క్యాన్సర్ పట్ల అవగాహన చేయడం అభినందనీయం–పోలీస్ కమిషనర్

నిజామాబాద్ జై భారత్ జూలై 18 : ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ ను నివారించవచ్చని  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, IPS అన్నారు.శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందు క్యాన్సర్ హాస్పటల్ ఆవరణంలో ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. అమెరికాలో వైద్య విద్య చదువుకున్న 12 మంది విద్యార్థులను అభినందించారు. ఇందుర్ క్యాన్సర్ హాస్పటల్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 250 మందికి ఎక్స్రే ఈసీజీ బ్లడ్ షుగర్ క్యాన్సర్ కు సంబంధించిన స్క్రీనింగ్ చేయడం అభినందనీయం అన్నారు. ఎవరైనా ముందుగా గుర్తిస్తేనే ఏ వ్యాధినైనా నివారించవచ్చునని తెలిపారు. ప్రతి ఒక్కరూ నడవడికను అలవాటు చేసుకోవాలని సూచించారు.చదువుకుంటే ఏదైనా సాధించవచ్చని సూచించారు. ప్రతి మనిషి ఏదో ఒక విధంగా సహాయం చేయాలని తెలిపారు. ఆ సహాయం వల్ల ఇతర కుటుంబాలకు ఎంతో ప్రయోజనం పొందుతుందని అన్నారు. అలాగే గ్రేస్ ఫౌండేషన్ ద్వారా పోలీసులందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని తెలపడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాదారులు శ్రీరామ్ అయ్యర్, జంపన్న వర్మ, శ్రీధర్ శేషాద్రి, రవీంద్రనాథ్ సూరి, డాక్టర్ చిన్నబాబు, డాక్టర్ ప్రతిమరాజ్, డాక్టర్ జీవన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!