నిజామాబాద్ జై భారత్ జూలై 7:సోమవారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్ పోలీస్ కార్యాలయంలోని CCRB సెక్షన్ ను పర్యవేక్షించడం జరిగింది.సమీక్షలో భాగంగా , కమిషనర్ అఫ్ పోలీస్ జిల్లా పోలీసుల పనితీరుని , మెరుగు పరచే విధంగా ప్రతీ డేటా ను సమీకరించాలని రిపోర్ట్ లను తయారు చేయాలి అని , సమీకరించిన డేటా , విశ్లేషణ తర్వాత , పోలీస్ పనితీరుని అంచనా వేసే విధంగా ఉండాలి అని సిబ్బంది కి సూచించడం జరిగింది.ఈ సందర్భంగా CCRB ఇన్స్పెక్టర్ ఎస్. సతీష్ కుమార్, SI లు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.