నిజామాబాద్ జై భారత్ మే:31 (షేక్ గౌస్ )ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం (World No Tobacco Day) సందర్భంగా శనివారం నగరంలోని మాలపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ మరియు సదస్సు ఘనంగా నిర్వహించబడింది.ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆధ్వర్యంలో జరుపుకునే ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశ్యం — పొగాకు వాడక వల్ల కలిగే హానికర ప్రభావాలను ప్రజలకు తెలియజేయడం, ధూమపానాన్ని మానేందుకు ప్రోత్సహించడం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఉప ఆరోగ్య అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, డాక్టర్ అంజనా, ఎన్సీడీ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ సామ్రాట్ యాదవ్, డాక్టర్ వెంకటేష్ తదితరులు మాట్లాడుతూ “ధూమపానం ఆరోగ్యాన్ని కాదు, జీవనాన్ని దహనం చేస్తుంది. ఒక సిగరెట్ వల్ల ఒక్క నిమిషం సంతోషం కనిపించొచ్చు, కానీ జీవితాంతం బాధలు మిగులుతాయి. మీ ఇంట్లో ధూమపానం ఉంటే ఆరోగ్యానికి తలుపు మూసినట్టే.”విషపదార్థాల ముప్పు సిగరెట్, బీడీ, గుట్కా వంటి పొగాకు పదార్థాల్లో నికోటిన్, టార్ వంటి ప్రమాదకర పదార్థాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు, నోటి క్యాన్సర్, స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతాయి. అలాగే పాసివ్ స్మోకింగ్ వల్ల ధూమపానం చేయని వారు కూడా తీవ్రంగా ప్రభావితమవుతారు — ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు.ధూమపానం వదిలితే కలిగే ప్రయోజనాలు 20 నిమిషాల్లో గుండె స్పందన సాధారణ స్థాయికి వస్తుంది 12 గంటల్లో రక్తంలోని కార్బన్ మోనో ఆక్సైడ్ స్థాయి తగ్గుతుంది 3 నెలల్లో ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది.1 సంవత్సరం తర్వాత గుండె సంబంధిత ప్రమాదం తగ్గుతుంది వాక్యాలు – మార్పు కోసం నినాదాలు .పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలంటే… ముందుగా మీరు ధూమపానాన్ని మానండి. ప్రేమించండి – మీ శరీరాన్ని, మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని. ధూమపానానికి స్వస్తి చెప్పండి.మీరు తాగిన ప్రతి సిగరెట్… మీ జీవితాన్ని కాపాడే కొన్ని నిమిషాలను కొట్టేస్తుంది.ఆరోగ్యమే మహాభాగ్యం… సిగరెట్ దాన్ని దూరం చేస్తుంది.ధూమపానానికి ‘నో’ అనండి – జీవితానికి ‘హెలో’ చెప్పండి.ఈ సందర్భంగా పోస్టర్ ప్రదర్శన, ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించబడింది. వైద్య అధికారులతో పాటు డాక్టర్ సహిస్తా ఫిర్దోష్, డాక్టర్ అజ్మతున్నేస్ బేగం, డాక్టర్ భార్గవి, డాక్టర్ అవంతి, డిహెచ్ఇ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, గోవర్ధన్, గిరిధర్, పర్యవేక్షకురాలు శ్యామల, షాదుల్లా మెడికల్ కాలేజీ విద్యార్థులు, సీతారాం నగర్, అర్సపల్లి ఆరోగ్య కేంద్రాల ఆశా కార్యకర్తలు, ANMs పాల్గొన్నారు.
పొగాకు నియంత్రణే ఆరోగ్య భారతం – అవగాహన ర్యాలీ & సదస్సు
Published On: May 31, 2025 6:21 pm
