నిజామాబాద్ జై భారత్ మే:23 (షేక్ గౌస్) గత రెండు రోజులుగా పట్టణంలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో ట్రాఫిక్ వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ముఖ్యంగా శుక్రవారం మాధవనగర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ కొనసాగింది. ఈ సమయంలో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగినా, వర్షపు నీరు తగ్గకపోవడంతో పరిస్థితి అదుపులోకి రావడానికి ఆలస్యం అయింది. స్థానికులు ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని కోరుతున్నారు.