గిడ్డంగులను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:22 ( షేక్ గౌస్)
వర్షాల నేపథ్యంలో బియ్యం నిల్వలను వేగంగా తరలించాలని ఆదేశాలు.
జిల్లాలో కొనసాగుతున్న వర్షాల కారణంగా బియ్యం, ధాన్యం నిల్వల భద్రతపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రత్యేక దృష్టి సారించారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు గిడ్డంగులతో పాటు గుండారం శివారులోని స్టేట్ వేర్ హౌజ్ కార్పొరేషన్ గిడ్డంగులను ప్రత్యక్షంగా సందర్శించారు.
ఈ సందర్భంగా మిల్లింగ్ అయిన బియ్యం నిల్వలు, ధాన్యం బస్తాల పరిస్థితి, నాణ్యత పరీక్షలు, లాటింగ్ ప్రక్రియ తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఏ రైస్ మిల్లుల నుంచి ఎంత పరిమాణంలో బియ్యం వచ్చిందో, ఇంకా ఎన్ని బస్తాలు రావలసి ఉందో సక్రమ సమాచారం తీసుకున్నారు.వర్షాకాలం దృష్ట్యా బస్తాలు తడిసి నష్టానికి గురికాకుండా తక్షణమే గిడ్డంగులకు తరలించాలన్న ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన చోట్ల టార్పాలిన్ షీట్లను ఉపయోగించి ధాన్యాన్ని రక్షించాలని సూచించారు.గిడ్డంగుల్లో లీకేజీలు లేకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, లోడింగ్-ఆన్లోడింగ్ ప్రక్రియలో జాప్యం జరగకుండా కావలసినంత మంది హమాలీలు, సరిపడా లారీలను అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.గిడ్డంగుల వద్ద బియ్యం నిల్వల ఆన్లోడింగ్‌లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయాన్ని కలెక్టర్ గమనించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు.ఈ సందర్శనలో డీఎస్ఓ అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయిస్ డీఎం శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ సెక్రటరీ అపర్ణ, గిడ్డంగు మేనేజర్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!